పోస్ట్‌లు

అక్టోబర్ 23, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి 67₹ వేలు దక్కాయి

చిత్రం
ఇటీవల కబడ్డీ వరల్డ్ కప్ గెలిసిన భారత జట్టు వరుసగా మూడు సార్లు గెలిసి రికార్డు సాధించింది.కానీ ఒలంపిక్ లో గెలిచినా వాళ్ళ లాగా బారి నజరనా ఉంటుంది అని అందరు భావించారు,కానీ వాళ్లకు ప్రైజ్ మనీ వచ్చింది 10లక్షలు,దాన్ని వాళ్ళు పంచుకుంటే తలా ఒక్కరికి 67వేల రూపాయలు మాత్రమే.కేంద్ర క్రీడ మంత్రి విజయ్ గోయల్ ఫైనల్ ను వీక్షించారు, కానీ క్రీడకరులను వారు కాన బారిచిన ప్రతిభ కు తగ్గ న్యాయం మాత్రం జరగలేదు."దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వగా వుంది కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ లు నజరనాలు ప్రకటించక పోవడం ఆశ్చర్యంగా వుంది, మకేమి కాసుల వర్షం కురిపించకండి కానీ తగిన గుర్తింపు ఇవ్వండీ" అని వరల్డ్ కప్ హీరో అజయ్ ఠాకూర్ అన్నారు.ఒలంపిక్ లో రజత పతకం గెలిసిన p. v సింధు కు దాదాపు 15 కోట్లు ముట్టయి.2011లో ఐసీసీ వరల్డ్ కప్ గెలిసిన  భారత క్రికెట్ టీమ్ లో ఒక్కొక్కరికి కోటిన్నర ముట్టింది.కానీ ఎంతో ప్రతిభ కనబరచిన కబడ్డీ జట్టు మాత్రం దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటుంది.దీనికి కారణం అందరికి తెలిసిందే ! "ఇండియాలో అంతే" నా?.ఇప్పటికి అయిన గుర్తించి అన్ని క్రీడల క్రీడాకారులకు ప్రభుత్వ మిచ్చే నజరణలు ఒకేలా ఉండాలి