పోస్ట్‌లు

ఆగస్టు 14, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

నిరుద్యోగ యూవతకు ఇతను ఆదర్శం

ప్రభుత్వ ఉద్యోగం చాలామంది కుర్రకారు కల... సాకారం కావాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే... సరదాలు మానాలి.. గంటలకొద్దీ పుస్తకాలకే అతుక్కుపోవాలి...లక్షలమందితో పోటీ పడి నెగ్గాలి... ఒక్క కొలువే గగనమైన ఈ రోజుల్లో ఏకంగా ఆరింటిని అవలీలగా సాధించాడు ఆదిలాబాద్‌ జిల్లా కుర్రాడు రాపెల్లి రాజశేఖర్‌. ఖానాపూర్‌కి చెందిన అమృత, ఎర్రన్నలు వ్యవసాయ కూలీలు. మా పిల్లలు మాలాగ కష్టపడొద్దని వాళ్ల తపన. చదువే అందుకు మార్గంగా కనపడింది. కన్నవాళ్ల కోరికను చిన్నప్పుడే అర్థం చేసుకున్నాడు రాజశేఖర్‌. క్షణం దొరికినా పుస్తకం వదిలేవాడు కాదు. ఆ కష్టం ఫలితాన్నిచ్చింది. పదోతరగతిలో పాఠశాలలో ప్రథముడిగా నిలవడంతో రాజశేఖర్‌లో ఏదైనా సాధించొచ్చనే ఆత్మవిశ్వాసం పెరిగింది. ఓ ప్రైవేటు కళాశాల ఉచిత భోజన, వసతి కల్పించడంతో పట్టుదలగా చదివి నిర్మల్‌ పట్టణ టాపర్‌గా నిలిచాడు. 84 శాతం మార్కులతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అదే జోరుతో ‘గేట్‌’ రాస్తే జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు వశమైంది. డిగ్రీ పట్టా చేతికందగానే కొలువుల వేట ప్రారంభించాడు రాజశేఖర్‌. 2010లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో మొదటి ఉద్యోగం కొట్టి ఖాతా

గూగుల్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర నిజాలు

ఇంటర్నెట్ యూజర్లు మెచ్చుకున్న బెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్‌సైట్ గూగుల్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్ గా గూగుల్ గుర్తింపు సొంతం చేసుకుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా గూగుల్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర వాస్తవాలను కింద చూడొచ్చు... * వాస్తవానికి గూగుల్ సెర్చ్ ఐడియాను లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లు $1 మిలియన్ కు అమ్మేద్దామనుకున్నారట. కానీ ఆ ఆలోచనను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో వీరే స్వయంగా గూగుల్ ను ప్రారంభించి ఓ సంచలనాన్ని సృష్టించారు. * గూగుల్ అసలు పేరు Googol * 1997లో గూగుల్ ను కొనుగోలు చేసే ఆఫర్‌ను యాహూ తిరస్కరించింది. * గూగుల్‌కు వచ్చే ఆదాయంలో 97శాతం ప్రకటనల ద్వారా వచ్చేదే. * గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పొందుపరిచిన అసాధారణ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ ఏ ఇతర వెబ్‌సైట్ లోడ్ చేయనంత వేగంగా (0.5 సెకన్లు అంతకన్నా తక్కువ సమయంలో) గూగుల్ వెబ్ పేజీలనులోడ్ చేస్తుంది. * ఏదైనా శోధనా ప్రశ్నకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలను బట్వాడా చేసే క్రమంలో గూగుల్

ఏ రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే అదృష్టం కలసివస్తుంది

కలర్స్ మూడ్ ఫిల్టర్స్. నిజమే.. దీనివెనక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. కలర్స్ మన మెదడుపై ప్రభావం చూపుతాయని.. సైన్స్ చెబుతోంది. అన్ని కలర్స్ కి అర్థాలున్నాయి. అలాగే.. మన మూడ్ పై ప్రభావం చూపుతాయి. అలాగే మూడ్, పర్సనాలిటీపైనా కలర్స్ ప్రభావం ఉంటుంది. 2016లో ఏ రాశి వాళ్లకు ఏ కలర్ అదృష్టం తీసుకొస్తుంది ? వారంలో ఒక్కో రోజుకి ఒక్కో కలర్ ప్రత్యేకం. ఒక రోజు ఒక కలర్ ధరించడం వల్ల.. మనకు కొంతైనా మంచి జరుగుతుంది. ఇక్కడ కొన్ని కలర్స్ వారాన్ని బట్టి.. ధరించాలి. ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించడం వల్ల మీ మైండ్, మూడ్, లక్ అన్నీ కలిసొస్తాయో చూద్దాం..     ఏ రోజు ఏ రంగు డ్రసె వేసుకుంటే.. అదృష్టం కలిసిసొస్తుంది ? ఆదివారం సండే రెడ్ లేదా ఆరంజ్ షేడ్స్ ధరించాలి. ఆదివారం సూర్యుడికి సంకేతం. కాబట్టి.. ఎరుపు, నారింజ రంగు దుస్తులు ధరిస్తే.. మీకు అదృష్టం కలిసొస్తుంది.     ఏ రోజు ఏ రంగు డ్రసె వేసుకుంటే.. అదృష్టం కలిసిసొస్తుంది ? సోమవారం సోమవారంను చందమామ పాలిస్తాడు. అలాగే శివుడికి ప్రత్యేకం. కాబట్టి.. శివుడికి ప్రత్యేకమైన రంగు నీలం. అందుకే సోమవారం.. నీలిరంగు లేదా సిల్వర్ లేదా లైట్ గ్రే కలర్ దుస్తులు ధరించాలి

ఆత్మహత్యకు రాష్ట్రపతినే అనుమతి అడిగాడు

నోయిడా: తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించమంటూ ఓ వ్యక్తి భారత రాష్ట్రపతిని కోరారు. 54ఏళ్ల డీకే గార్గ్‌ గ్రేటర్‌ నోయిడా ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(జీఎన్‌ఐడీఏ) ఉద్యోగులు తనని వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని అనుమతి ఇవ్వమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ రాశాడు. ఓ సంస్థ ఏర్పాటుచేసుకోడానికి అనుమతి కోరగా జీఎన్‌ఐడీఏ అధికారులు లంచం అడుగుతున్నారని, లంచం ఇస్తేనే ఇన్‌స్టిట్యూట్‌కి అనుమతి మంజూరు చేస్తామని అన్నారని తెలిపారు. ఆ అవినీతి, వేధింపులు తాను తట్టుకోలేకపోతున్నానని, ఎన్‌ఓసీ ఇవ్వడానికి ఏళ్ల తరబడి తిప్పుకొంటున్నారని, ఆ ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని అందుకు అనుమతివ్వమని గార్గ్‌ రాష్ట్రపతికి లేఖ రాశాడు. దీనిపై జీఎన్‌ఐడీఏ సీఈవో దీపక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ గార్గ్‌ ఆరోపణలను ఖండించారు. సరైన పత్రాలు సమర్పించనందునే ఎన్‌ఓసీ ఇవ్వడానికి ఆలస్యం అయివుంటుందని, విచారణ జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై నివేదికను అందిస్తామన్నారు.