గూగుల్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర నిజాలు

ఇంటర్నెట్ యూజర్లు మెచ్చుకున్న బెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్‌సైట్ గూగుల్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్ గా గూగుల్ గుర్తింపు సొంతం చేసుకుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా గూగుల్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర వాస్తవాలను కింద చూడొచ్చు...
* వాస్తవానికి గూగుల్ సెర్చ్ ఐడియాను లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లు $1 మిలియన్ కు అమ్మేద్దామనుకున్నారట. కానీ ఆ ఆలోచనను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో వీరే స్వయంగా గూగుల్ ను ప్రారంభించి ఓ సంచలనాన్ని సృష్టించారు.
* గూగుల్ అసలు పేరు Googol
* 1997లో గూగుల్ ను కొనుగోలు చేసే ఆఫర్‌ను యాహూ తిరస్కరించింది.
* గూగుల్‌కు వచ్చే ఆదాయంలో 97శాతం ప్రకటనల ద్వారా వచ్చేదే.
* గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పొందుపరిచిన అసాధారణ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ ఏ ఇతర వెబ్‌సైట్ లోడ్ చేయనంత వేగంగా (0.5 సెకన్లు అంతకన్నా తక్కువ సమయంలో) గూగుల్ వెబ్ పేజీలనులోడ్ చేస్తుంది.


* ఏదైనా శోధనా ప్రశ్నకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలను బట్వాడా చేసే క్రమంలో గూగుల్ 200 కారకాలను పరిగణలోకి తీసుకుని కేవలం ఒక్క సెకను కాలంలో అత్యుత్తమ అవుట్పుట్‌ను విడుదల చేస్తుంది.
* గూగుల్ తన స్ట్రీట్ వ్యూ మ్యాప్స్ ఫీచర్ కోసం ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మైళ్ల రోడ్డు మార్గాన్ని ఫోటోల ద్వారా చిత్రీకరించింది.
* 2013కు గాను 91 శాతం గూగుల్ రెవెన్యూలో 55.5 బిలియన్ డాలర్ల ఆదాయం కేవలం ప్రకటనల ద్వారానే వచ్చింది.
* సగటను ఒక్క సెకను కాలంలో 40,000 శోధనా ప్రశ్నలు గూగుల్‌లో ప్రాసెస్ కాబడతాయి.
* గూగుల్ శోధన సూచిక (సెర్చ్ ఇండెక్స్) 100 మిలియన్ గిగాబైట్లు అంతకన్నా ఎక్కువ సైజును కలిగి ఉంటుంది. ఈ డేటాను నింపటానికి లక్ష వన్-టెరాబైట్ పర్సనల్ డ్రైవ్‌లు అవసరముతాయి.
* గూగుల్ పేరు వాస్తవానికి బ్యాక్ రబ్. లారీ‌పేజ్, సెర్జీబ్రిన్ అనే ఇద్దురు యువకులు కలిసి ఓ గ్యారేజీలో స్థాపించిన కంపెనీ పేరే బ్యాక్ రబ్. ప్రస్తుతం గూగుల్‌గా ప్రపంచానికి విస్తరించింది.
* గూగుల్ సంస్థకు మొట్టమొదటి చెఫ్(వంటమనిషి)గా చార్లీ అయిర్స్ నవంబర్ 1999లో నియమితులయ్యారు. అప్పటి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 40.
* గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీ-మెయిల్ 50కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. జీమెయిల్ తెలుగు భాషలో కూడా లభ్యమవటం మనుకు గర్వకారణం.
సేకరణ:-రా జ్ మహమ్మద్ ,డే బై డే న్యూస్ 7/24.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ