వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

వినాయక చవితి వచ్చిందంటే.. పూలు, ఆకులు, విగ్రహాల సందడి మొదలవుతుంది. అయితే.. ఇంటికి విగ్రహం తీసుకొచ్చేటప్పుడు అందరికీ అంతుచిక్కన సందేహం.. వినాయకుడి తొండం. వినాయకుడి తొండం ఎటు వైపు ఉంటే మంచిదనే సందేహం ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది.కొంతమంది కుడివైపుకి తిరిగిన తొండం ఉన్న వినాకుడిని తీసుకోవాలి అని సూచిస్తే.. మరికొందరు ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడి శ్రేష్టమని చెబుతారు. అసలు వినాయకుడి తొండం ఎటు వైపు తిరిగి ఉండాలి ? కుడివైపు మంచిదా ? ఎడమవైపు మంచిదా ? లక్ష్మీ గణపతి వినాయకునికి తొండము ముఖ్యము.
 కుడి వైపుకు తిరిగి ఉన్న తొండము ఉన్న గణపతిని ‘లక్ష్మీ గణపతి' అంటారు.
 తపో గణపతి తొండము లోపలి వైపుకు ఉన్న గణపతిని ‘తపో గణపతి' అని అంటారు. పూజలు వద్దు తొండము ముందుకు ఉన్న గణపతికి అసలు పూజలు చేయరాదు. 
వృద్ధ గణపతి గణపతికి ఒక దంతము విరిగి ఉంటుంది. విరిగి ఉన్న ఆ దంతము చేతితో పట్టుకొని ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటారు. ఈ గణపతికి కూడా పూజలు చేయరాదు. ఎలుక కంపల్సరీ గణపతి వాహనము ఎలుక కాబట్టి మనం పూజించే ప్రతిమలో గణపతి విడిగా, ఎలుక విడిగా ఉండకూడదు. గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా జాగ్రత్త పడాలి. నవ్వుతున్న గణపతి గణపతి ముఖంలో చిరునవ్వు ఉండాలి. మనం పూజించే గణపతి ప్రతిమ చిరునవ్వు ఉన్న గణపతిగా ఉండటం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. చతుర్భుజాలు గణపతికి చతుర్భుజాలు ఉండాలి. ఒక చేతిలో లడ్డు, మరో చేతిలో కమలము, మరో చేతిలో శంఖము, మరో చేతిలో ఏదైనా ఆయుధము ఉండాలి. ఎడమవైపు వినాయశుడి తొండం ఎప్పుడూ ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి విగ్రహాన్నో, చిత్రపటాన్నో కొనడం చేయాలి. గౌరీదేవివైపు గణేశుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీ దేవి వైపు అంటే.. ఎడమ వైపుకి ఉండాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఇళ్లలో ఇలాంటి గణపతినే పెట్టుకోవాలి. కుడివైపు కుడివైపు తొండం తిరిగిన గణపతిని దక్షిణాముఖి గణపతి అనిపిలుస్తారు. ఇలాంటి విగ్రహాలను గుళ్లలో పెట్టుకోవాలి. ఎందుకంటే.. కుడివైపు తొండం తిరిగిన గణపతికి చాలా నిష్టగా, ప్రతిరోజూ పూజలు చేయాలి. కాబట్టి ఆలయాల్లో పెట్టుకోవడం మంచిది. వెనక, ముందు రూపాలు వినాయకుడి ముందురూపం సంపదలు, శ్రేయస్సు అందిస్తుంది. కానీ వినాయకుడి వెనుకముఖం పేదరికాన్ని సూచిస్తుంది. కాబట్టి వినాయకుడి వెనుకముఖం మీ ఇంటి బయటద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. దక్షిణ దిశలో మీ ఇంటి దక్షిణ దిశలో గణేశ విగ్రహం ఉంచకూడదు. మీ ఇంట్లో తూర్పుదిశలో కాని, పశ్చిమ దిశలోకాని గణేశుడి విగ్రహాన్ని ఉంచాలి. స్నానాల గదికి వద్దు స్నానాలగదికి జోడించిన గోడకు ఎప్పుడూ గణేశ విగ్రహాన్ని ఉంచకూడదు.

Read more at: http://telugu.boldsky.com/spirituality/which-side-should-the-trunk-the-ganesha-idol/slider-pf65550-013796.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

మనిషి విలువ