పోస్ట్‌లు

అక్టోబర్ 30, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

జాగిత్యాల జిల్లా లో పాకిస్థాన్ ,ఆప్ఘనిస్థాన్ -ల సంచారం

చిత్రం
జగిత్యాల జిల్లాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో అదుపులోకి తీసుకున్న వీరిని… పాకిస్థాన్ లేదా ఆప్ఘనిస్థాన్ కు చెందినవారిగా మొదట అనుమానించారు. వారిని ప్రశ్నించిన రాయికల్ పోలీసులు… ఐదుగురిలో ముగ్గురు ఆప్ఘనిస్థాన్ కు చెందినవారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పాస్ పోర్టుల ఆధారంగా.. నఖీముల్లా, వహీదుల్లా, అజహర్ లుగా గుర్తించారు. మిగతా ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. కరీంనగర్ నుంచి.. టాటా సుమో వాహనంలో వచ్చిన ఈ ఐదుగురి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో… స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాయికల్ పోలీసులు వీరిని… స్టేషన్ కు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. వారి పాస్ పోర్టులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు

రైతు లకు శుభవార్త

చిత్రం
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు లేక అవస్థలు పడుతున్న రైతులకు శుభవార్త. దరఖాస్తు చేసుకున్న అన్నదాతలందరికీ రాబోయే ఏడు నెలల్లో కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. కార్యాచరణను ప్రారంభించడంతో కొన్నేళ్లుగా విద్యుత్తు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశ చిగురించింది. గ్రామాల వారీగా దరఖాస్తు చేసుకున్న రైతులను గుర్తించడంతో పాటు కనెక్షన్‌ మంజూరుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనే దానిపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. అలాగే ఆయా విద్యుత్తు కనెక్షన్లకు ఏయే సామగ్రి అవసరం, ఎంత మొత్తం ఖర్చు అవుతుందనే దానిపై సర్వే నిర్వహిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై ‘న్యూస్‌టుడే’ కథనం. ఉమ్మడి జిల్లాగా ఉన్న ఆదిలాబాద్‌లోనే నాలుగు జిల్లాలకు చెందిన సర్కిల్‌ కార్యాలయం ఉంది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల సర్వే పూర్తి చేసి అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపించాలని సర్కిల్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు మండలాల వారీగా రిజిస్టరు చేసుకున్న రైతులతో పాటు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు డ

విశాఖ పిచ్ పైన వివాదం

చిత్రం
వైజాగ్ పిచ్ ఫై వివాదం చుట్టూముట్టయి.భరత్ తో 5వన్డే లో న్యూజిలాండ్ 79 పరుగులకే అల్ ఔట్ కావడం చర్చమశం అయిన్ది.ఇటీవల ఈ వేదిక ఫై అసోం - రాజస్థాన్ రంజీ మ్యాచ్త్ లో ఒకే రోజు 17 వికెట్లు పడిపోవడం తో అసోం కోచ్ సునిల్ జోషి ఇది నాసిరకం పిచ్ అని ఆరోపించారు.ఇలాంటి పిచ్ లపై  వన్డే, టెస్ట్,ఎలా నిర్వహిస్తారు అని అన్నారు.28అక్టోబర్ వన్డే మ్యాచ్త్ లో మొత్తం 16వికెట్లు నెలకులాయి. దీని ఫై ఏసీఏ కార్యదర్శి గోకరాజు స్పందిస్తూ పిచ్ లో లోపం లేదు, రంజీ ఆడిన పిచ్ ఫై వన్డే మ్యాచ్ ఆడించలేదన్నారు.ఆయితే వన్డే జరిగిన తీరు చూస్తే స్టేడియం లోని మొత్తం పిచ్ ల ఫై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఈ నెల 17 నా భరత్-ఇంగ్లండ్ ల మధ్య మొదలయే రెండో టెస్ట్ కు వినియోగించే పిచ్ ఫై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.భారత్,కివీస్ 5వ మ్యాచ్ ను తిలకించిన ఒక మాజీ క్రికెటర్ పిచ్ ఫై టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కూడా రెండు రోజుల్లో ముగుస్తుందేమో నని సన్నిహితుల మధ్య కామెంట్ చేసినట్టు సమాచారం.