పోస్ట్‌లు

మే 21, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

తాసీల్ధార్ కార్యాలయం నుండి ధ్రువీకరణ పత్రాలు ఇలా పొందండి

చిత్రం
మీకు ధ్రువీకరణ పత్రాలు అవసరమా..? అయితే ఇలా చేయండి! హైదరాబాద్‌: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జూన్‌ మాసంలో కళాశాలలు, పాఠశాలలు పున:ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు పొందే వారికి ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్‌లో సీటును పొందే వారికి విధిగా కళాశాలలో కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. వీటి ఆధారంగానే రిజర్వేషన్లతో పాటు స్థానికతను విద్యాసంస్థలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే స్కాలర్‌షిప్‌కు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో ప్రస్తుతం మండల కార్యాలయాల్లో చాలా మంది ఈ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుం టున్నారు. నిబంధనలు తెలియక మధ్య దళారులను ఆశ్రయి స్తూ వారికి లంచాలు ఇస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందడం అతి తేలికని, అందరూ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్‌ కార్యాలయం చెప్తోంది. ఈ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే వివరాలు మీ కోసం.. ◆ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం.. ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీ