పి. వి. సింధు నుండి మనం ఏం నేర్చుకున్నాం?

#  '  సింధు ' ని చూసి ఏమి నేర్చుకోవాలి   #
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
సింధు సాధించిన వెండి పతకంతో
భారతీయులందరు మురిసిపోయారనేది
ముమ్మాటికీ నిజమే

గెలిచినవాడి భుజం మీద చెయ్యి వేసి
వీడు మా వాడే అని విర్రవీగి చెప్పే
వెర్రి వెంగలప్ప ప్రభుత్వాలు ;
ఈ ఘటన నుండి ఏమి నేర్చుకున్నాయి

అతి ఉత్సాహం ప్రదర్శించి
ప్రజల సొమ్ముని
ప్రసాదం లా పంచే హక్కు యాడ ఉంది
( అన్ని కోట్లా )

అంత ఆనందం పట్టలేకుంటే
పార్టీ నిధుల్లోనుంచో
మీ జేబు లోనుంచి ఇవ్వండి
సంతోషిస్తాం

మీరు చేయవల్సిందీ , సింధు కి
కోట్లు రూపాయలు , కోట్లరూపాయల
విలువ చేసే స్థలాలు కాదండి( అది జనం కష్టార్జితం )
సింధూ లాంటి అమ్మాయిలని ఎలా
తాయారు చేయాలి ,అందుకు మీ గవర్నమెంటులు ఏం చేయబోతున్నాయో
ఏ క్రీడావిధానం అమలుచేస్తారు ?? చెప్పండి !!

స్కూల్లో పిల్లలు ఆటలు ఆడినందుకు
పరీక్షల్లో మార్కులు కలపండి

Play ground లేకపోతే
PT సర్ లేకుంటె స్కూల్ మూసేయించండి

టైం టేబుల్ లో ఒక్క పీరియడ్ అయినా
సరే పిల్లలు ఆటలు ఆడవల్సిందే అని హుకుం జారీ చేయండి

Playing Kits , అన్ని స్కూల్స్ కు ఉచితంగా
ఇవ్వండి ( ఇవి ఇవ్వటానికి డబ్బు ఉండదేం )

Olympics గాదు ముందు
లోకల్ టోర్నమెంట్సు ,ఆడించండి
లోకల్ టాలెంటెడ్ ' సింధూ ' లు చాలా మంది ఉన్నారు ,; పాపం మీ దరిద్రగొట్టు విద్యావిధానాల వలన
ఇంటా ,బయట , స్కూల్లోనూ
ప్రతి క్షణం ,చదువు,చదువు , పరీక్షలు,
మార్కులు ,అని ఒకటే బెంగతో
ఇటు తల్లితండ్రులు ,అటు పిల్లలు
Class rooms లోనే ,homeworks తో
మగ్గి పోతున్నారు ,
వారంతా , ఒక్కసారిగా ,మైదానంలో
అడుగిడితే ,ప్రపంచంలో భారతీయులవే
పధకాలు....

సచిన్ ని మోసినంతకాలం మోసారు
ఏమైంది ?

ఇప్పుడు ఎంతమంది సచిన్ లు రడీగా ఉన్నారు ;

అమ్మా ' సింధూ ' నీ విజయాన్ని తక్కువ
చేయటానికి కాదమ్మా నే అంటున్నది
ఈ మాత్రం చలనం కలిగించావు అందుకు
నీకు జే జే లు

ఎప్పటికప్పుడు ఎదవ డ్రామాలాడే
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ,విద్యా ,క్రీడా విధానాలపైనే నా ఆవేదన...

130 కోట్ల జనాభా ఉంది
చేయూతనివ్వండి , ఒకొక్క క్రీడకి
శత వీరులు సిద్ధమవుతారు.....
జయహో భారత్ !!  జయహో !!!
సేకరణ:-(రాజ్ మహమ్మద్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ