దయ, బాంచెన్ పించెన్ ఇవ్వండి

ఈమె పేరు బొల్లే లక్ష్మి(49)(sc), ఊరు రాంపూర్,మండలం మాల్యల్, కరీంనగర్.చిన్న వయస్సు లో బాల్యవివాహం జరిగింది.ఒక సంవత్సరం కూడా కాకా ముందే భర్త నుండి దూరం గా తల్లిదండ్రుల వద్దకు వచ్చి చేరింది. కూలి పని తల్లిదండ్రుల తో పాటు చేస్తూ జీవనం సాగించింది.తల్లిదండ్రులు చని పోవడం తో వున్నా తమ్ముని ఇంటి ముందు చిన్న గుడిసె వేసుకొని జీవిస్తుంది.గత ప్రభుత్వాలు ఈమెకు వితంతు పింఛన్ ఇచ్చేవి, కానీ ప్రస్తుతం ఈమెకు పింఛన్ రావడం లేదు.ఈమె భర్త వేరొక వివాహం చేసుకొని చనిపోయాడు, అతని రెండో భార్య కు వితంతు పింఛన్ వస్తుంది.అధికారుల వద్దకు పోయి ఈమె ఏమని మొరపెట్టుకోవలో అర్థం కావడం లేదు.పెరిగిన పింఛన్ వస్తే ఈమెకు ప్రస్తుత పరిస్థితి లో ఎంతో ఉపయోగకరం.కలిసిన ప్రతివారిని "అయ్యా మీ దండం పెడతా పింఛన్ వచ్చేలా చేయండి మీకు పుణ్యం ఉంటది"అంటుంది.ఈమె ఆధార్ కార్డ్ లో d/o పెట్టిచుకున్నది తెల్వక. ఇప్పుడు ఆరోగ్యం సహకరించిన రోజు కూలికి లేదంటే ఇంటి వద్ద ఉంటుంది.తెలిసిన వాళ్ళు ఎవరైనా బియ్యం ఇస్తే వారికీ పనికి పోవడం.ఇప్పటి వరకు mla కు, rdo కు,mro కు చాల సార్లు దరఖాస్తు చేసుకుంది. అయిన లాభం లేదు.ఏమంటే go లో ఇలాంటి వారి గురించి లేదు అనే సమాధానం.ఎవరి వద్దకు పోయి మొరపెట్టు కోవాన్నో, ఎవరికీ చెప్పు కోవాన్నో తెలియని స్థితి లో వుంది బొల్లే లక్ష్మి.
సేకరణ:-రాజ్ మహమ్మద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ