నిమ్మ కాయ - ఉపయోగాలు

నిమ్మ అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే దివ్యౌషధం. ఆరోగ్య ప్రదాయిని. జీర్ణ సమస్యలను తగ్గించడంలో నిమ్మకు మించినది మరొకటి లేదనడంలో ఎటువంటి సందేహం లేదు. శరీరంలోని లవణ శాతాన్ని పెంచి, వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో నిమ్మ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే ఎండాకాలంలో నిమ్మరసం తాగడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. అయితే నిమ్మ వల్ల కేవలం ఇవే కాదు ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి.

నిమ్మరసాన్ని రోజూ నిద్ర లేవగానే ఉదయం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఒక విధానం ప్రకారం తాగాలి. 2కప్పుల నీటిని వేడి చేయాలి. ఆ వేడి నీరు గోరువెచ్చగా ఉండగా 4 అల్లం ముక్కలు నీటిలో వేయాలి. వాటితో పాటు ఒక నిమ్మకాయను అందులో పిండుకోవాలి. కొంత పెప్పర్, ఒక టీ స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని కలగలిపి సేవించడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే నీటి శాతం పెరిగుతుంది. చర్మానికి మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీనివల్ల వ్యాధికారక క్రీముల తాకిడికి చర్మం తట్టుకుంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ