సౌదీలో క్షమాభిక్ష ప్రారంభం:వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారికీ

తమ దేశంలో వీసా నిబంధనలను ఉల్లంఘించి పని చేస్తున్న విదేశియూలు ఎలాంటి జరిమానా , జైలుశిక్ష లేకుండా స్వచ్చందంగా స్వదేశాలకు తిరిగి వెళ్ల డాని కి సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించిన మూడు నెలల క్షమాభిక్ష బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.వేలాది మంది తెలుగు ప్రవసియూలు ఇందుకు సంబంధించిన వివరాల కోసం గత రోజులుగా అతృతతో ఎదిరి చూస్తున్నారు.స్వస్థలాలకి తిరిగి వెల్లలనుకుంటున్న తెలుగు ప్రవసియూల వద్ద పాస్ పోర్ట్ లు లేక పోవడం తో రియద్ , జిద్దా లలోని భారతీయ అంబేసి కార్యాలయాలు వీరికి తాత్కాలిక పాస్ పోర్ట్ లు జారీ చేస్తున్నాయి.సుదూర ఎడారి ప్రాంతాల్లో కూడా భారతీయ అంబేసి అధికారులు పర్యటించి దరఖాస్తుదారులకు ప్రయాణ పత్రాలను జారీ చేస్తున్నాయి.తిరిగి వెళ్లే వారి సహాయార్థం తము 24 గంటలు సేవాలందిస్తామని భారతీయ కౌన్సిల్ జనరల్ నూర్ రెహమాన్ షేక్ చెప్పారు. భారతీయ అధికారుకు జారీ చేసిన పాస్ పోర్ట్ లను సౌదీ ఇమిగ్రేషన్ అధికారులకు అందజేయడం తోపాటు వెలి ముద్రల ను సమర్పించి తర్వాత దేశం విడిచి వెళ్ళడానికి సౌదీ అధికారులు అనుమతించారు.తొలి రోజు రియాద్ నగరం లో దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని ఏపీ ఎనార్టీ ప్రతినిధి , ప్రముఖ సామాజిక కర్యకర్త ఆంటోనీ రెవల్ చెప్పారు.ఇక్కడి తెలుగు వారందరికీ తము సహాయం చేస్తామని ధమ్మము లోని అప్ ఎనార్టీ ముఖ్య ప్రతినిధి రాధ కృష్ణ ,జిద్దా తెలుగు సంఘము అధ్యక్షులు మహమ్మద్ యూసఫ్ తెలిపారు.ప్రవసియూలు గడువు లోపు వెల్లకుంటే రెండేళ్ల జైలు శిక్ష తో పాటు రూపాయలు18.50లక్షలు జరిమానా విధిస్తారు.ఇలాంటివారు ఒక్క తెలంగాణ ప్రాంతం వారె 20వేల మంది ఉంటారని అంచనా.
తెలుగు సంఘాల ఫోన్ నంబర్స్, ఇండియన్ అంబేసి ఫోన్ నంబర్స్ క్రింద లింక్ లో👇
http://www.yahind.com/regional/ksa/associations_links.shtml
http://www.indianembassy.org.sa/Contactus.aspx

సేకరణ: ఎండీ. రాజ్ మహమ్మద్,డై బై డే న్యూస్ వాష్ రిపోర్టార్.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ