మీ పిల్లల ప్రైవేట్ చదువుల గురించి మీకు కొన్ని నిజాలు

విద్య సంవత్సరం మొదలుతో మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యలు ప్రైవేట్ వ్యవస్థలో.
వ్యాన్, స్కూల్ డ్రెస్, బుక్స్, ఫిజు.

వ్యాన్:
రవాణా శాఖ నిబంధనల ప్రకారం👇

ప్రభుత్వం సూచించిన నిబంధనలు స్కూలు యాజమాన్యాలు తూచా తప్పకుండ పాటించాలి.
ఈ 30 ప్రభుత్వ నిభందనలేమిటి మీపిల్లలు ప్రయానించే స్కూలు బస్సు సురక్షితమేనా తెల్సుకొండి?

స్కూలు బస్సులు తరచూ ప్రమాదాలకు గురవడంతో ప్రభుత్వం నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులలోని ప్రతి ఒక్క నియమ నిబంధనను తూచా తప్పకుండా పాటించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రతి ఒక విద్యాసంస్థ కృషిచేయాలని స్పష్టం చేశారు. కానీ కొన్ని పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం కారణంగా ఈ నింబధనలను తుంగలో తొక్కి విద్యార్థులను తరలించేందుకు బస్సులను ఉపయోగిస్తున్నారు. రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా పాఠశాలల యాజమాన్యాలలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు.
ఇవీ ప్రభుత్వ నిబంధనలు..
సంవత్సన్నర క్రితం 185వ చట్టం క్లాజ్‌ (ఎఫ్‌) తరువాత క్లాజ్‌ (జి) ప్రకారం విద్యాసంస్థల బస్సులకు అదనపు నిబంధనలు జోడించారు.

1) స్కూలు బస్సుపై కాలేజ్ పేరు, లాండ్ లైన్ టెలిఫోన్‌ నంబరు, సెల్పోన్ నంబరుతో పాటు పూర్తి చిరునామాను బస్సు ఎడమవైపు, బస్సు ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాల్సి ఉంటుంది.

2) 60 సంవత్సరాల వయసు మించిన డ్రైవరును నియమించరాదు

3) పాఠశాల యాజమాన్యాలు బస్సు డ్రైవర్‌, బస్సుకు చెందిన పూర్తివివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.

4) పాఠశాల యజమాని డ్రైవర్‌కు ఆరోగ్యపట్టిక (హెల్త్‌కార్డు) నిర్వహించాలి. రక్తపోటు, షుగర్‌, కంటిచూపు, ప్రాథమిక ఆరోగ్యపరీక్షలు ప్రతి మూడునెలలకు ఒకసారి యాజమాన్యం సొంత ఖర్చులతో చేయించాలి. ఈ కార్డును బస్సులో భద్రపరచాలి

5)బస్సుడ్రైవరును నియమించే సమయంలో అతని లైసెన్స్‌ను ఆర్టీఏ కార్యాలయంలో ఒకసారి సరిచూసుకోవాలి

6) 5 సంవత్సరాల అనుభవం గల డ్రైవర్‌ను మాత్రమే నియమించాలి

8) సదరు డ్రైవరు నియామకాన్ని తల్లిదండ్రుల కమిటీకి తెలియజేయాల్సి ఉంటుంది.

9) బస్సుకు సంబంధించిన బాహ్యపరికరాలు, మెకానిక్‌ కండిషన్‌ తదితరవి పరిశీలించేందుకు నెలకు ఒకసారి ప్రిన్సిపాల్‌, తల్లిదండ్రుల కమిటీ బస్సును తనిఖీ చేయాలి. ఒక రిజిస్టర్‌ను సైతం ఏర్పాటుచేయాలి

10) బస్సులో ఒక అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై పెద్ద అక్షరాలతో అత్యవసర ద్వారం అని రాసి ఉండాలి

లిస్ట్‌(ఏ), (బి) చట్టం(బి) ప్రకారం…
11)ప్రతి స్కూలు బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథమిక చికిత్స పెట్టెను ఉంచాలి

12) నెలకోసారి ప్రిన్సిపాల్‌, తల్లిదండ్రుల కమిటీ ఈ పెట్టెను చెక్‌చేయాలి ఇందుకోసం ఒక రిజిస్టర్‌ను సైతం ఏర్పాటుచేయాలి

13) బస్సుకు తప్పకుండా ఒక అటెండర్‌ను ఉంచాలి. యూనిఫాం ధరించి ఉండాలి

14) బస్సులో ప్రయణిస్తున్న విద్యార్థుల పూర్తివివరాలు బస్సులో ఉంచాలి. విద్యార్థు ఎక్కవలసిన స్థలం, దిగవలసిన స్థలం రాసి ఉండాలి

15)బస్సులోపల ఉన్న విద్యార్థులు డ్రైవర్‌కు కనబడేలా, బస్సు దిగుతున్న విద్యార్థులు కనబడేలా అద్దాలను ఏర్పాటుచేసుకోవాలి

16) బస్సు ఇంజన్‌ కంపార్టు మెంటులో అగ్నిమాపక పరికరం ఉంచాలి

17)బస్సులో సీట్లకింద బ్యాగులు ఉంచేందుకు అర ఉండాలి

18)బస్సుకు నాలువైపులా పసుపు పచ్చని రంగు లైట్లు ఉంచాలి ఇవి విద్యార్థులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఉపయోగించాలి

19) చిరిగిన సీట్లు ఉండకూడదు

20) టైర్లు అరిగిపోయి ఉండకూడదు

21) విద్యార్థులు బస్సు ఎక్కేందుకు వీలుగా అదనంగా ఒక మెట్టు ఉండాలి

22 సీట్ల సామర్ధ్యం కంటే ఎక్కువ మంది విద్యార్థులను తీసుకొని వెళ్లరాదు

23) ప్రతి విద్యాసంస్థ కలిగి ఉన్న 10 బస్సులకు గాను ఒక బస్సు అదనంగా ఉంచాలి

24)బస్సులకు సురక్షితమైన లాకింగ్‌ సిస్టమ్‌తో అమర్చబడి ఉండాలి

25) సైడ్‌విండోలకు మధ్యలో మూడు లోహపు కడ్డీలు అమర్చాలి.

27)బస్సులోకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మెట్లకు సమానంగా రైలింగ్‌ను ఏర్పాటుచేయాలి
28)ప్రతి స్కూలు బస్సు జూన్‌ 12 తేదీ లోపు ఈ పరీక్షలు చేయించుకోవాలి
29)15 ఏళ్లకు పైబడిన బస్సులు నడపరాదు.
30) ప్రతి విద్యాసంస్థ కలిగి ఉన్న 10 బస్సులకు గాను ఒక బస్సు డ్రైవరు ను అదనంగా ఉంచాలి.
ఇవన్నీ ఉంటేనే వ్యాన్ అన్ని అనుమతులు పొందుతాయి.

స్కూల్ డ్రెస్ & ఫీజు

ప్రైవేట్ స్కూల్ ల్లలో ఒక స్కూల్ డ్రెస్ కు మరొక స్కూల్ డ్రెస్సుకు సంబంధం ఉండదు.వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేసి మెడలో ఒక ఐ. డి కార్డ్,బెల్ట్, ప్యాంటు చొక్క ఏర్పాటు చేసుకొని,విటీనాన్నిటిని ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి వారి ద్వారా
డబ్బు సంపాదిస్తారు.
బుక్స్
 ప్రభుత్వం నుండి వస్తే వాటిని మండల జిల్లా కేంద్రాలలో కొందరికి తమకు కవలసినవారికి ప్రభుత్వం నుండి వచ్చిన క్షన్



మళ్ళీ కల్చరల్ ప్రోగ్రాం పేరుతో , ప్రత్యేక ప్రోగ్రాం పేరుతో వసూళ్లు చేస్తారు.
వీటికి ఎలాంటి నిబంధనలు లేవు.ఇది అదనం.
ఇక పోతే ఫీజు
ఇ టెక్నో, మోడల్, ఐఐటీ, కాన్సెప్ట్,ఏ/సి  స్కూల్ల పేరుతో ఆర్భాటం చేసి లోపల వెళ్లి చూస్తే టాయిలెట్ , బాత్రూం, ఆట స్థలం ,గాలి వెలుతురు ఎలా ఉంటుందో ఇది చదువు తున్న వారికి కొంత వరకు తెలుసు.ఈ పేర్లతో ఏ స్థాయి లో వసూలు చేస్తారో కొన్ని స్కూల్ లు తెలుసు.
కొన్ని స్కూల్ లల్లో డైరీ,ఐ. డి కార్డ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు.ఇదేమిటి అంటే అన్ని స్కూళ్లలో వుండే మవద్దే అందరికన్నా తక్కువ అంటారు.
వీటి పై పర్యవేక్షణ లేక కాదు , అయిన ఎవరో కొందరి స్వార్థం కోసం మొత్తం వ్యవస్థను బ్రస్టు పట్టిస్తున్నారు.జిల్లా కేంద్రాల్లో వుండే స్కూళ్ల గురించి చెప్పనక్కర్లేదు.
తెలంగాణ రాష్ట్రంలో పుస్తకాలు ప్రైవేట్ స్కూలు లల్లో మమ్మరాదు, అనే నిబంధనను పెడితే కొందరు ఒక్కఅడుగు ముందుకేసి వారి ఉపాధ్యాయులచే దగ్గర్లో వారే షాప్స్ తెరిచి అమ్మించారు.అలా నడిచే షాప్ లకు అన్ని పర్మిషన్స్ తెచ్చుకొని పుస్తకాలు అమ్మడం వరకు పరిమితం చేసి మూసేసారు.ఎవరైనా మేము బయట కొంటాం అంటే మళ్ళీ కొర్రీలు పెడతారు.ఇవి ఎక్కడ దొరకవు, మేము ప్రత్యేకంగా తెప్పించం అని చెబుతారు.పిల్లల మనస్తత్వం తెలిసిన వీరు, పిల్లలను ఫీజు విషయంలో, ప్రత్యేక చెల్లింపుల విషయంలో వారిని భయాందోళనకు గురిచేస్తారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు ,చెల్లింపులు జరుగుతుంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మాత్రం నగదు వసూలు చేస్తారు. అన్ని చెల్లింపులను.అన్ని విషయాలు ఫోన్ ద్వారా తెలియజేస్తూ , డబ్బుల విషయాన్ని మాత్రం పిల్లలకు చెపుతారు.
ప్రభుత్వ ఆదేశాలు , పాటించవలసిన ప్రమాణాలు,నిబంధనలు, మనకెక్కడ కనిపంచావు.
పిల్లల చదువు విషయం లో తల్లిదండ్రులు/ఉపద్యయూలు ఇద్దరి పాత్ర సమానంగా ఉంటుంది.ఎవర్ని తప్పు పట్టడానికి వీలులేదు,బాల్యంలో పిల్లలు అధిక సమయాన్ని స్కూల్లో, ఇంట్లో గడుపుతారు,డబ్బులు కట్టి "మీరు అడిగినంత ఇచ్చమ్ కదా"అని పేరెంట్స్ అనకూడదు.నెలకోసారి విసిట్ చేసి పిల్లల స్టేటస్ తెలుసుకోవాలి.అలాగే బాద్యతయూతం/జవాబుదారీగా మేనేగ్మెంట్ నడుచుకోవాలి.అప్పుడే మంచి పలుతాలు వస్తాయి, స్కూలుకు/తల్లిదండ్రులకు/సమాజానికి.

సేకరణ: రాజ్ మహమ్మద్






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తేడాలు: పట్టణ - పల్లె వాసులకు

వినాయకుని తొండం ఎటు వైపునకు ఉంటే మంచిది?

మనిషి విలువ